- Home
- tollywood
శరవణన్ దర్శకత్వంలో విశాల్ 31వ సినిమా
విశాల్ తాజాగా తన 31వ చిత్రాన్ని ప్రకటించారు. దీనికి శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. దీనికి ‘విశాల్ 31’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అసలు టైటిల్ త్వరలో ప్రకటించనున్నట్లు సినిమా వర్గాలు తెలిపాయి.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో కఠిన నిబంధనలు పాటిస్తూ షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ చిత్రంపై అంచనాల్ని పెంచేసింది. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ వ్యాఖ్యలతో విడుదలైన ఈ పోస్టర్‌లో విశాల్ లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణుల పేర్లు సైతం ఈ పోస్టర్‌లో కనిపిస్తాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు.